వ్యాక్సిన్ వేయించుకుంటే బిర్యాని ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి..!

Sunday, April 11th, 2021, 01:00:53 AM IST


కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ పేరుతో మరింత విస్తృతంగా వ్యాక్సినేషన్ కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. అయితే ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు పలు సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీలను అందిస్తున్నాయి. అయితే ఫ్రీగా అయినప్పటికి కొన్ని షరతులు కూడా వర్తిస్తాయండోయ్.

అయితే టీకా ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లకు ఉచితంగా బిర్యానీ అందిస్తామని ‘హలో కిచెన్’ అనే సంస్థ ప్రకటించింది. విజయనగరం, కాకినాడలో బ్రాంచ్‌లలో ఈ ఉచిత బిర్యానీ ఆఫర్ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ తీసుకున్నట్టు రశీదు చూయిస్తేనే బిర్యానీ ఫ్రీగా ఇస్తారు. అంతేకాదు ఈ ఆఫర్ తొలి వంద మందికి మాత్రమే అని కూడా షరతులు పెట్టారు. మరింకెందుకు ఆలస్యం తొందరగా వ్యాక్సిన్ తీసుకోండి.. బిర్యానీ పొట్లం పట్టేయండి.