టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం.. అడ్డుకున్న గ్రామస్తులు..!

Saturday, June 27th, 2020, 08:23:46 PM IST


ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురయ్యింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నీరు చెట్టు పథకంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

అయితే అక్రమంగా నీరు చెట్టు పథకంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ఇప్పుడు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించడమేంటని బిక్కవోలు మండలం కాపవరం గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. వెనక్కి వెళ్ళిపోవాలంటూ కాన్వాయ్‌కి అడ్డుగా నినాదాలు చేశారు. దీంతో చేసేదేమి లేక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెనుదిరిగారు.