దిశ హత్యకు కారణం అదే.. కేసీఆర్‌ని టార్గెట్ చేసిన బీజేపీ..!

Thursday, December 12th, 2019, 08:32:30 PM IST

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే దిశ హత్య కేసుకు సంబంధించి బీజేపీ సీఎం కేసీఆర్‌ని టార్గెట్ చేసింది. మద్యం వలనే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, తెలంగాణలో మద్యాన్ని నిషేదించాలన్న డిమాండ్‌తో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ ఇందిరా పార్కు వద్ద మహిళా సంకల్ప దీక్షను చేపట్టింది.

అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్ మద్యం వలనే దిశ హత్య జరిగిందని, బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ మద్యపాన రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఇక మీద దిశ లాంటి హత్యలు జరగవని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించాడు. ఇక రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతుందని, ఎక్కడపడితే అక్కడ మద్యం విచ్చల విడిగా అమ్ముతున్నారని అసలు కేసీఆర్ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నారో సమాధానం చెప్పాలని మండిపడ్డారు.