మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన వివిధ పార్టీల కార్పోరేటర్లు..!

Friday, May 22nd, 2020, 01:50:17 AM IST

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్పోరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 25వ డివిజన్‌ కార్పోరేటర్ సిరిగాదా ధర్మపురి, కాంగ్రెస్‌కు చెందిన 40వ డివిజన్‌ కార్పోరేటర్‌ న్యామతాబాద్‌ శివచరణ్‌ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

అంతేకాదు మెండోరా మండలం సావెల్‌ గ్రామ ఎంపీటీసీ పుప్పాల రాజు కూడా మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే వీరందరికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జనరంజక పాలన నచ్చి చాలా మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.