కనుమ రోజు జనసేన, బీజేపీ కీలక సమావేశం.. సర్వత్రా ఆసక్తి..!

Wednesday, January 15th, 2020, 12:30:00 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురుంచి, అమరావతి రైతుల నిరసనల గురుంచి వివరిస్తూ జేపీ నడ్డాతో పాటు, పలువురు బీజేపీ ముఖ్య నాయకులతో పవన్ చర్చలు జరిపారు. అంతేకాదు బీజేపీ పెద్దలని కలవక ముందు పవన్ పలువురు ఆర్ఎస్ఎస్ నేతలను కూడా రహస్యంగా కలిసినట్టు తెలుస్తుంది.

అయితే పవన్ బీజేపీ నేతలను కలవడంతో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జనవరి 16న కనుమ రోజు విజయవాడలో బీజేపీ, జనసేన మధ్య కీలక సమావేశం జరనుందని, ఆ తరువాత ఇరు పార్టీలు ఉమ్మడిగా కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటాయని జనసేన పార్టీ ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ ఈ ఇరు పార్టీల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.