బ్రేకింగ్: ఆ వైసీపీ మంత్రికి అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన బీజేపీ..!

Tuesday, July 23rd, 2019, 06:11:54 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.

అయితే టీడీపీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు మరియి కొందరు సీనియర్ నేతలు టీడీపీనీ వీడి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడాలన్న లక్ష్యంతో అధికారంలో ఉన్న వైసీపీ నేతలపై కూడా కన్నేసింది. వారిని కూడా ఆశచూపి బీజేపీలో చేర్చుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే తాజాగా విజయవాడలో వైసీపీ కీలక నేతగా, మరియు జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు తెర మీదకు వచ్చింది.

అయితే ఈయన రాజకీయ ప్రస్థానం తొలుత ప్రజారాజ్యం నుంచి మొదలెట్టినా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో విజయవాడ పశ్చిమ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపేయడంతో ఈయన బీజేపీలో చేరిపోయారు. అయితే 2014 నుంచి బీజేపీ తరుపున విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈయనపై వైసీపీ తరుపున గెలిచిన జలీల్ ఖాన్ టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరిపోయారు. అయితే ఈయన వైసీపీ స్థానం ఖాళీ అవ్వడంతో వైసీపీలోకి చేరిపోయారు. అంతేకాదు ఈ సారి ఎన్నికలలో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొంది ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈయన గతంలో బీజేపీ నేత కావడంతో ఈయనను ఎలాగైనా తమ పార్టీలోకి లాక్కోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారట. అంతేకాదు ఈయనకు రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ నాయకుడు రాం మాధవ్ ఫోన్ చేసి పార్టీలోకి వస్తే సహాయ మంత్రి లేదా స్వంతంత్ర కోటాలో మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసారట. అంతేకాదు రాష్ట్రంలో మంత్రి పదవి కేవలం రెండున్నర సంవత్సరాలే అని మరో రెండేళ్ళలో వైసీపీ ప్రభుత్వం డీలా పడిపోతుందని చెప్పాడట. అయితే ఐదేళ్ళ కేంద్ర మంత్రి పదవి కావాలా, రెండేళ్ళ రాష్ట్ర మంత్రి పదవి కావాలా ఆలోచించుకో అని ఆఫర్ చేసారట. అయితే వెల్లంపల్లి ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా రాష్ట్ర రాజకీయాలు వైసీపీకి అనుకూలంగా లేకపోతే తాను పార్టీ మారడానికి సిద్దమేనని బీజేపీ నేతలకు సంకేతాలు అందించారని సమాచారం. ఏదేమైనా ఎప్పటికైనా వెల్లంపల్లి మాత్రం బీజేపీలో చేరిపోవడం మాత్రం ఖాయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.