తెలంగాణలో 2023లో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భవిష్యత్తులో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానే అని అన్నారు. ఏపీలో క్రైస్తవ రాజ్యం.. తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొనడంతో అక్కడకు వెళ్ళి పరిస్థితిని సమీక్షించిన బండి సంజయ్ శివాజీ జయంతి ఉత్సవాలను అడ్డుకోవటం సిగ్గుచేటని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామాన శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. హిందువుల దేవుళ్ళను అవమానించిన ఎంఐఎంకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపించారు. నిఖార్సైన హిందువునని చెప్పుకునే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. మత మార్పిడులపై ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం ఉందని, హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.