సీఎం కేసీఆర్‌కి లేఖ రాసిన బండి సంజయ్.. ఏమన్నారంటే..!

Tuesday, March 24th, 2020, 03:48:00 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. అయితే రాష్ట్రంలో కరోనాను ఎదురుకోవడానికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

అంతేకాదు రాష్ట్రంలోని లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు కరోనాపై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో పాలుపంచుకోవడనికి సిద్దంగా ఉన్నారని, రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో నిత్యవసర వస్తువుల ధరలు పెరగకుండా దళారులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19ను కేంద్రం ఆయుశ్మాన్ భారత్‌లో చేర్చిందని తెలంగాణాలో కూడా ఆయుశ్మాన్ భారత్‌ను అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.