గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటింది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అన్ని సీట్లను గెలుచుకోలేకపోయినా టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాదు గత గ్రేటర్ ఎన్నికలలో రెండో స్థానంలో ఉన్న ఎంఐఎంను వెనక్కి నెట్టి బీజేపీ ఈ సారి రెండో స్థానంలో నిలిచింది. ఇదేకాదు ఒక డివిజన్లో ఉన్న మొత్తం 5 స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది.
సరూర్ నగర్ డిబిజన్లోని సరూర్ నగర్, ఆర్ కె పురం, కొత్తపేట్, చైతన్యపురి, గడ్డి అన్నారంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ ఐదు చోట్ల బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఆర్.కె.పురంలో బీజేపీ 2,273 ఓట్ల మెజారిటీ సాధించగా, సరూర్ నగర్లో బీజేపీకి 2,526 ఓట్ల మెజారిటీ దక్కింది. కొత్తపేటలో 2,598 ఓట్ల మెజారిటీ, చైతన్యపురిలో 4,326 ఓట్ల మెజారిటీ, గడ్డి అన్నారంలో 3,384 ఓట్ల మెజారిటీ సాధించింది.