నిన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కును వినియోగించుకోవడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. కవిత అటు నిజామాబాద్ లో, ఇటు గ్రేటర్ ఎన్నికల్లో రెండిట్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది. ఒక చోట ఓటు హక్కు ఉన్న ఓటర్, మరో చోట ఎలా ఓటు వేస్తారని ప్రశ్నిస్తూ ఇలా రెండు చోట్ల నుంచి ఓటేసిన కవితను తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది.
ఇదే కాకుండా కవిత ర్వండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవడంపై టీపీసీసీ అధికార ప్రతినిది ఇందిరా శోభన్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కూతురే ఇలా రెండు చోట్ల ఓటు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరుస్తూ దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదని, తక్షణమే కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.