హాట్ టాపిక్ : జగన్ ను టార్గెట్ చేసి బీజేపీ దెబ్బ తింటుందా.?

Saturday, August 24th, 2019, 04:09:50 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయాలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే వచ్చే ఎన్నికల సమయానికల్లా ఎలా అయినా సరే వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా దెబ్బ తీయాలనే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు.ఈ క్రమంలో అన్ని పార్టీల కంటే బీజేపీ పార్టీ అయితే ఒక ఆకు ఎక్కువే చదివిందని చెప్పాలి.కేంద్రంలో సత్సంబంధాలు ఉన్నట్టుగానే రాష్ట్రం నుంచి మాత్రం జగన్ ను పెద్ద ఎత్తున బీజేపీ నేతలు టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టారు.ఇప్పటికే అదే పార్టీకు చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఇటీవలే పార్టీలో చేరినటువంటి మాజీ ఎంపీ సుజనా చౌదరిలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.

కానీ ఈ క్రమంలో బీజేపీలోనే ఆధిపత్య పోరు నడుస్తోందన్న వార్తలొస్తున్నాయి.జగన్ ను టార్గెట్ చెయ్యడం ఏమో కానీ ఇప్పుడు మాత్రం బీజేపీలోనే అంతర్గత కలహాలు మొదలయ్యాయని తాజాగా చేరిన సుజనా ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై కన్నేశారని ఒక వర్గం అంటుంది. దీనితో సుజనా వల్ల కన్నాకు చిక్కులు తప్పేలా లేవని అన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మొత్తానికి వీరు జగన్ ను టార్గెట్ చెయ్యడం ఏమో కానీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉనికిని వీరే ఏదో చేసుకునేలా ఉన్నారని ఈ వార్త తెలుసుకున్న వైసీపీ అభిమానులు అంటున్నారు.