ఇదిరా జగన్ సత్తా అంటే..బాబు చేయలేనిది జగన్ చేసి చూపించాడు

Monday, June 17th, 2019, 07:44:23 AM IST

జగన్ కి సరైన అనుభవం లేదు. ఎదో ఒక్కసారి అవకాశం అడిగాడని చెప్పి ఏకంగా రాష్ట్ర భవిష్యత్తు అతని చేతిలో పెడుతారా..? అతనికి ఏమి తెలుసు పాలన గురించి అంటూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, కానీ జగన్ ఎదో చేస్తాడనే నమ్మకంతో ప్రజలు అతనికి మద్దతు ప్రకటించారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునే దిశగా జగన్ ముందుకి వెళ్తున్నాడు. ఇప్పటికే అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజాదరణ పొందుతున్న జగన్, తాజాగా కేంద్రం నుండి మనకి రావలసిన నిధులను వచ్చేలా చేయటంలో విజయం సాధించాడు . దాదాపు రాష్ట్రానికి చెందిన 4200 కోట్లు పెండింగ్ బిల్లు ఇవ్వటానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.

ఒక్క పోలవరానికి 3000 కోట్లు నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రాజెక్టు అయిన పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.11,655 కోట్లు ఖర్చుపెట్టింది. ఇందులో కేంద్రం రూ.6,726 కోట్లు ఇచ్చింది. మిగతా డబ్బుల కోసం చంద్ర బాబు ప్రభుత్వం చాలా సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయినాసరే మోదీ సర్కార్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాకతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకేసారి 3000 కోట్లు విడుదల చేసింది.

ఇంకా పోలవరం విషయంలో పెండింగ్ లో వున్నా 1,929 కోట్లు మరి కొన్నిరోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా ఉపాధి హామీ పథకం కింద రూ.708 కోట్లు విడుదల చేసింది. మే చివరి వారంలో కూడా కేంద్రం వివిధ స్కీమ్స్‌ కోసం రూ.534 కోట్లు రిలీజ్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే జగన్ ప్రభుత్వ పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయిన కేంద్ర ప్రభుత్వంతో పేచీ పెట్టుకుంటే మన గోచి ఊడిపోతుంది. ఆ విషయం జగన్ కి బాగా తెలుసు. అందుకే గొడవలు లేకుండా సామరస్యంగా ముందుకి వెళ్తున్నాడు.