ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఆట మొదలయ్యిందా?

Tuesday, June 11th, 2019, 01:40:52 PM IST

గత కొన్నాళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్ర మరియు తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ నేతలు మరియు రాజకీయ నాయకులు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ వారు పూర్తి స్థాయి ప్రక్షాళన చేసే విధంగా కేవలం వారి పార్టీ జెండాయే ఎగరాలి అన్న భావనతో ఉంటారని స్థానికంగా మన బలం ఏమిటో వారికి చూపించాలని అంటుంటారు.అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ప్రజలు కూడా స్థానికత్వానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కూడా అందరికీ తెలుసు.కానీ ఇప్పుడు ఈ మాటలు చెప్పిన రాజకీయ నాయకుల మరియు విశ్లేషకుల మాటలు నిజమయ్యే పరిస్థితులు ఉన్నాయా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది.

తెలంగాణాలో ఏమో కానీ ఆంధ్రా విషయానికి వస్తే రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ మరింత బలంగా మారే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ఎంతో బలమైన పార్టీగానే కాకుండా తిరుగులేని పార్టీగా కూడా అవతరించింది.ఇదొక్కటేనా ఇప్పుడు ఏపీలో వలసలు కూడా అధికారంలో ఉన్న వైసీపీని కాదని బీజేపీలోకి అధికంగా చేరుతున్నాయి.అందులోను కాస్త బలమున్న నేతలే చేరుతుండడం వారికి రాబోయే రోజుల్లో మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని అలా బీజేపీ పార్టీ కూడా మరో బలమైన పార్టీగా మారి వారు అనుకున్నది చేసినా సరే పెద్ద ఆశ్చర్య పడక్కర్లేదు అని విశ్లేషకులు అంటున్నారు.