బ్రేకింగ్: తిట్టిన వారితోనే శబాష్ అనిపించుకుంటున్న సీఎం జగన్

Tuesday, October 15th, 2019, 12:49:32 PM IST

జగన్ చేస్తున్న కార్యక్రమాలకు మెల్లమెల్లగా ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. జగన్ ని స్టికర్ సీఎం అని విమర్శించినా నేతలు, చంద్రబాబు నాయుడు పాలనకు జగన్ పాలనా కి తేడా ఏమి లేదు అని తెలిపిన నేతలు సడన్ గా తమ రూటు ని మార్చేశారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై చాల విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా పేరుతో ఏటా రు. 13,500 రూపాయల్ని అర్హులకు అందించనుంది. అయితే మొదటిసారిగా ఒక పథకానికి పీఎం పేరుని పెట్టడంతో బీజేపీ నేతలు జగన్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైయస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పేరుతో రైతులకు ఈ పథకం చేరనుంది. జగన్ ని పొగుడుతూనే, గత ప్రభుత్వం తీరుని గుర్తు చేసారు కన్నా లక్ష్మీనారాయణ. గత ప్రభుత్వం లాగా కాకుండా, కేంద్రం ఇచ్చే నిధులతో వివిధ సంక్షేమ పథకాలకు ప్రధాన మంత్రి పేరు జత చేసి లబ్ది దారులకు అందజేయాలి అన్నారు. పీఎం కిసాన్ పథకం తో ప్రతి ఒక్క అర్హులైన రైతుకు రు. 6000 ను ప్రభుత్వానికి కేంద్రం అందజేస్తుంది. మరి జగన్ చేస్తున్న ఈ పని కి విమర్శకుల ప్రశంసలు పొందడం గొప్ప విషయమేనని చెప్పాలి.