తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు – బండి సంజయ్!

Friday, July 10th, 2020, 03:00:26 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ మేరకు పరిస్తితి కూడా అదుపు తప్పింది అని, హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి అని ఇప్పటికే పలువురు నేతలు కోరారు. అయితే తాజాగా బండి సంజయ్ తెరాస వైఖరి పై పలు అంశాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అంతేకాక కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం అందించినా, కేంద్రం పై మాత్రం తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సెక్షన్ 8 పై గవర్నర్ జోక్యం చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు.

ఈ విషయం పట్ల కేంద్రానికి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం తీరు పై ఎలా స్పందిస్తారో చూసిన తర్వాత తమ అభిప్రాయం చెబుతాం అని అన్నారు. అంతేకాక సెక్రటరీయట్ కూల్చి వేత నిర్ణయం ను సైతం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.అయితే పలు రకాలుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న నేపధ్యం లో బండి సంజయ్ ఆ అంశం పై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తెరాస కి కొమ్ముకాస్తున్నారు అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.