జగన్ ను విష్ణుమూర్తి తో పోల్చడం బాధాకరం – బీజేపీ నేత

Wednesday, April 7th, 2021, 12:48:17 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను విష్ణుమూర్తి తో పోల్చడం బాధాకరం అంటూ బీజేపీ నేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు తిరుమల తిరుపతి దేవస్థానం కి భంగం కలిగించే విధంగా ఉన్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్య మతస్తులకు వేరే విభాగాలకి బదిలీ చేయాలి అంటూ భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. అయితే రాజకీయంగా మాట్లాడాలి అనుకుంటే ప్రధాన అర్చకుడి పదవికి రాజీనామా చేయాలని భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. అయితే సీఎం జగన్ ను విష్ణుమూర్తి తో పోల్చడం పట్ల పలువురు బీజేపీ కి చెందిన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.