టీడీపీ ఓటమికి అసలు కారణం చెప్పిన బీజేపీ నేత..!

Thursday, July 11th, 2019, 12:48:52 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక ఇప్పుడిప్పుడే టీడీపీ తిరిగి కోలుకునే అవకాశాలు కూడా కనిపించడంలేదు.

అయితే టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అసలు కారణం ఇదేనంటూ ప్రకాష్‌ జవడేకర్‌ సంచలన ఆరోపణలు చేసారు. 2014 ఎన్నికలలో టీడీపీకి బీజేపీ మద్ధతు ఉండిందని అందుకే ఆ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించి అధికారం చేపట్టిందని అన్నారు. అయితే ఈ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకీ దూరమయ్యాడని అందుకే ఓటమి పాలయ్యారని అన్నారు. అయితే దేశమంతటా మోదీ క్రేజ్ పెరిగిపోయిందని ప్రతి రాష్ట్రంలో ఆయనకు అభిమానులు పెరిగిపోయారని ఇప్పుడు ఏ ప్రపంచ దేశాలు అన్ని కూడా భారత్ వైపు చూస్తున్నయంటేనే మోదీ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఇక మోదీ స్పీడులో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిందని, పార్టీకి అధ్యక్షుడు ఎవరో కూడా తెలియడంలేదని అన్నారు.