కవిత పై మరోసారి సెటైర్లు వేసిన బీజేపీ నేత…

Tuesday, August 20th, 2019, 01:32:41 AM IST

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్ష్యుడు లక్ష్మణ్ తెరాస నాయకురాలు కల్వకుంట్ల కవిత పై కొన్ని సంచలనమైం వాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఆ వాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ విజయవంతం అయిన సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ తెలంగాణాలో అధికార తెరాస పై మరియు తెరాస నేతలపై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ తెలంగాణ లో బలోపేతమవుతుండడంతో ఇక తెలంగాణాలో తెరాస పార్టీ ఫీటలు కూకటి వేళ్ళతో సహా కదులుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా తెరాస పార్టీ కార్య నిర్వహణాద్యక్ష్యుడు కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడుందని కొన్ని ప్రశ్నార్థకంగా వాఖ్యలు చేశారు. కాగా ఈ వాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ కేటీఆర్ మరియు కవిత పై కొన్ని సెటైర్లు వేశారు.

తెలంగాణాలో బీబీజేపీ పార్టీ ఎక్కడుందని కేటీఆర్ ప్రశ్నించడం కాదు… బీజేపీ పార్టీ ఎక్కడుందో, నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోయిన కవితను అడిగితె బీజేపీ పార్టీ ఎక్కడుందో సరిగ్గా చెబుతుందని బీజేపీ నేత లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డా కూడ తనకు ఎవరో తెలియదని చెప్పడం అనేది కేటీఆర్ అహంకారాన్ని అడ్డం లా చూపిస్తుందని, తాను కూడా కేటీఆర్ లాగ తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని బీజేపీ నేత లక్ష్మణ్ పలు రకాల విమర్శలు చేశారు. ఇకపోతే తెలంగాణాలో రానున్నరోజుల్లో బీజేపీ పార్టీ చరిత్రని సృష్టిస్తుందని, బీజేపీ దెబ్బకు మిగతా పార్టీలన్నీ కూడా మట్టికరుచుకపోవడం ఖాయమని లక్ష్మణ్ చెప్పారు. అధికార గర్వంతో చాలా దారుణమైన అవినీతికి పాల్పడుతుందని, త్వరలోనే అన్నింటిమీద విచారణ చేపట్ల కేంద్రాన్ని ఒత్తిడి చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.