చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే…బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

Thursday, July 9th, 2020, 02:27:18 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టీడీపీ, వైసీపీ పార్టీ ల మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన ఇళ్లను వైసీపీ ఎందుకు పంపిణీ చేయలేదు అంటూ వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తున్న నేపధ్యం లో బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్ని అబద్ధాలే అని వ్యాఖ్యానించారు. అంతేకాక టీడీపీ ప్రభుత్వ హయం లో కట్టిన ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు అని, కానీ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు మాత్రం పూర్తి చేసిన ఇళ్లను ఎందుకు పంపిణీ చేయలేదు అని అనడం హాస్యాస్పదం గా ఉంది అని విమర్శించారు.

అయితే ఈ నేపధ్యంలో వైసీపీ కి ఒక సలహా ఇచ్చారు సోము వీర్రాజు. టీడీపీ నేతలు మోసపూరిత చర్యలకు పాల్పడకుండా వైసీపీ ప్రభుత్వం చూసుకోవాలని సూచించారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు కి సంబంధించిన పు విషయాలను వెల్లడించారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందాలి అని వ్యాఖ్యానించారు. టీడీపీ లో జరిగిన అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఈ ప్రాజెక్టు నిర్మాణం లో అవినీతి జరిగింది అని, అది టీడీపీ ప్రభుత్వ హయం లోనే అని అన్నారు.