విజయ్ అదిరింది సినిమాకు రూ.60 కోట్ల నష్టం

Saturday, December 2nd, 2017, 12:51:13 PM IST

ఈ ఏడాది కోలీవుడ్ లో తెరకెక్కిన విజయ్ మెర్సల్ సినిమా అనేక వివాదాల నడుమ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అనంతరం కూడా సినిమాకు కొన్ని ఇబ్బందులు తప్పలేవు. జీఎస్టీ గురించి తప్పుగా చూపించారని భారతీయ జనతా పార్టీ నేతలు చిత్రంపై చాలా విమర్శలు చేశారు. అంతే కాకుండా తెలుగులో కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు. కానీ ఎట్టకేలకు అదిరింది అనే పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంది. పేదలకు ఉచిత విద్య అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే సినిమా మొత్తంగా రూ.250 కోట్లవరకు తెరకెక్కిందని కొందరు సినీ పండితులు తెలిపారు. కానీ సినిమాకు 60 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని భాజపా నేత ఎస్‌.వి.శేఖర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీశారని నిర్మాతలు తప్పుడు లెక్కలు చూపించారని కామెంట్స్ చేశారు. అంతే కాకుండా దర్శకుడు అట్లీ తన గత సినిమాలకు రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకుంటే.. ఈ సినిమాకు మాత్రం రూ.13 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకున్నాడని చెప్పారు. ఏ దర్శకుడైన ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకు రూ.5 కోట్లవరకు పెంచుతాడు. కానీ అట్లీ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఆ స్థాయిలో తీసుకున్నాడు. దీంతో సినిమా బడ్జెట్ పెరగడానికి అది కూడా ఒక కారణం అయ్యిందని ఎస్‌.వి.శేఖర్‌ తెలియజేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments