బ్రేకింగ్ న్యూస్ : టీవీ9 కు ఇలాంటి దెబ్బ తగులుతుందని ఊహించి ఉండరు.!

Sunday, October 20th, 2019, 12:38:41 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల్లో అతి పెద్దదైన వార్తా ప్రసార ఛానెల్ అంటే మొట్టమొదటిగా “టీవీ9″ ఛానెల్ ప్రతీ ఒక్కరికి గుర్తు వస్తుంది.వార్త ఏదైనా సరే దానిని అనేక రకాల కోణాల్లో చూపించి ఎప్పుడూ సంచలనం రేపుతుంటారు.ఈ విషయం అందరికి తెలిసిందే అలాగే వీరు అనేక రకాల సూక్తులు కూడా చెప్తుంటారు.ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఛానెల్ కు ఇప్పుడు బీజేపీ కీలక నేత అయినటువంటి రాజా సింగ్ దిమ్మతిరిగే షాకిచ్చారు.

తాజాగా టీవీ9 వారు హిందువులు ఎంతో పవిత్రంగా మరియు ఎంతో ఆహ్లాదంగా జరుపుకునే దీపావళి పండుగను ఉద్దేశించి టీవీ9వారు పెట్టిన వీడియో అభ్యంతరకరంగా ఉందని సంచలనానికి తెరలేపారు.”దీపావళి పండుగను జరుపుకునే వారిని గాడిదలుగా వారు చిత్రీకరించారని బక్రీద్ కు ఆవులను బలి ఇచ్చినపుడు క్రిస్మస్ కు చెట్లను నరికినప్పుడు ఎందుకు వీరికి నోరు పెగల్లేదని కేవలం హిందూ మతాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసారాని ప్రశ్నించారు” ఒకరకంగా ఈయన లేవనెత్తిన పాయింట్ లో కూడా నిజముంది.అప్పుడు అడగని వారు ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ అడగాలి అంటే నైతికంగా హక్కును కోల్పోయినట్టే అని చెప్పాలి.మరి దీనిపై టీవీ9 వారు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.