ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలనే పట్టించుకోవట్లేదు – ఇక ప్రజల పరిస్థితి ఏంటో…? బీజేపీ నేత కీలక వాఖ్యలు

Wednesday, October 16th, 2019, 09:30:03 PM IST

బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ బృందం తెలంగాణ గవర్నర్ తమిళసై ని కలుసుకుంది. కాగా ఆతరువాత ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఇష్టారీతిలో వ్యవహరిస్తుందని, న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని, కనీసం న్యాయస్థాన ఆదేశాలను కూడా తెరాస ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆర్టీసీ డిమాండ్లపై ప్రభుత్వం అసలే స్పందించడం లేదని, కేకే లాంటి సీనియర్ నేత ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదని వివరించారు లక్ష్మణ్.

ఇకపోతే ఇకపోతే ప్రజాధనాన్ని అంత కూడా ప్రభుత్వం నాశనం చేస్త్తుందని, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆర్టీసీ నాశనం చేస్తుందని గవర్నర్ కి వివరించామని, కాగా ఆర్టీసీ కార్మికుల ఆస్తులను కాపాడాలని లక్ష్మణ్ కోరుకున్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం వలన విద్యా వ్యవస్థ కూడా నాశనం అవుతుందని ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు కూడా ఆపేసింది అని ఆరోపించారు. కాగా ఆర్టీసీ కార్మికులందరికీ బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని, కార్మికులకు అందరికి కూడా బీజేపి అండగా ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.