జగన్‌కి చెక్ పెట్టగలిగేది బాలయ్య ఒక్కడే.. బీజేపీ నేత సంచలనం..!

Saturday, December 14th, 2019, 09:54:37 PM IST

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీలో చెక్ పెట్టగలిగే నాయకుడు బాలకృష్ణ ఒక్కరే అని బీజేపీ నేత, తెలుగు చలనచిత్ర అభివృద్ది మండలి మాజీ చైర్మన్ అంబికా క్రిష్ణ అన్నారు. నేడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న రూలర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన అంబికా కృష్ణ బాలయ్య గురుంచి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే రాష్ట్రంలో జరుగుతున్న తెలుగు, ఇంగ్లీష్ మీడియం వివాదంపై పరోక్షంగా స్పందించిన అంబికా క్రిష్ణ తెలుగు సినీ పరిశ్రమలో తెలుగుమీద పట్టున్న ఒకే ఒక్క హీరో బాలకృష్ణ అని, తెలుగు మీద పట్టు ఉన్న ఒకే ఒక హీరో బాలకృష్ణ అని అన్నారు. తెలుగు గొప్పతనం గురుంచి మాట్లాడాలన్నా, తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలన్నా అది ఒక్క బాలకృష్ణకే సాధ్యమని అన్నారు.