కేటీఆర్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మణ్..!

Monday, August 19th, 2019, 11:02:49 PM IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ కేటీఆర్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిన్న జేపీ నడ్దాగారి ప్రసంగాన్ని తప్పుపడుతూ కేటీఆర్ కొన్ని ఆరోపణలు చేసారు. అయితే కేటీఆర్ హెచ్చరికలకు పోవద్దని హెచ్చరికలకు పోతే మెక్కింది అంతా కక్కిస్తామంటూ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరును కమీషన్ల కాకతీయగా మార్చిందంటూ ఆరోపించారు. అయితే డబ్బులు దండుకోడానికి రూ.30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచేశారని ఆరోపించారు. కాంట్రాక్ట్ జేబులు నింపేందుకే ప్రాజెక్టు వ్యయాన్ని ఇంతగా పెంచారని తెలిపారు.

అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చేశారని ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని అన్నారు. రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటివి పూర్తిగా పక్కకి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని నాలుగు రోజులుగా సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో ముందు సమాధానం చెప్పాలని కోరారు.