అప్పుల, అవినీతి రాష్ట్రంగా తెలంగాణ–బీజేపీ నేత లక్ష్మణ్

Friday, December 13th, 2019, 03:18:20 PM IST

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల, అవినీతి రాష్ట్రము గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆర్థిక మంత్రి లేకుండా సమీక్షలు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీ కార్మికులు 30 మంది మరణించేవరకు కేసీఆర్ స్పందించలేదని దుయ్యబట్టారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం ఇలా తయారవ్వడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. అంగన్ వాడి, నిరుద్యోగ భృతి పథకాల్ని పట్టించుకోవడం మానేశారని, రైతుల ఎరువుల్ని పక్కదారి పట్టించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇటీవల జరిగిన దిశ హత్యోదంతం ని గుర్తు చేసుకొని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మద్యం ద్వారా ఏటా 20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. అయితే ఢిల్లీకి వెళ్లి కాళ్ళు, హైదరాబాద్ లో కన్నీళ్లు పెట్టుకుంటారని ఎద్దేవా చేసారు. అయితే పౌరసత్వ బిల్లుకు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేశారో చెప్పాలని నిలదీశారు.