ఏపీ, తెలంగాణ సీఎంలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు – విష్ణువర్ధన్ రెడ్డి

Wednesday, May 12th, 2021, 01:05:39 PM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రం కాస్త ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. అయితే ముందు నుండి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయి పగటి పూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే రాత్రి పూట కర్ఫ్యూ విధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయి, లాక్ డౌన్ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సరిహద్దుల వద్ద లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది. అయితే అంబులెన్స్ లను రాష్ట్రాల్లో అనుమతించక పోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే సరిహద్దుల్లో అంబులెన్స్ లని అడ్డుకోవడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచి పోయాయి అని వ్యాఖ్యానించారు. కోర్టు చెప్పినా స్పందించరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తెలంగాణ లో నేటికీ అంబులెన్స్ లను అనుమతించడం లేదు అని ఆరోపించారు. అయితే సమస్యలను పరిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. అంతేకాక సరిహద్దు వద్ద నెలకొంటున్న అంశం పై ఇరు రాష్ట్రాల డీజీపీ లు అధికారిక ప్రకటన ఎందుకు చేయడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే దీని పై ప్రభుత్వాలు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.