పార్టీకి దూరంగా ఉంటా.. బీజేపీ నేత రఘునందనరావు కీలక నిర్ణయం..!

Monday, February 10th, 2020, 10:26:47 PM IST

తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావుపై ఇటీవలే రాధా రమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రఘునందన్ రావు తనపై లైంగిక దాడి చేశడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళలను రఘునందన్ భయపెట్టి లొంగదీసుకుంటాడని, వారికి మత్తు మందు ఇచ్చి టాలీవుడ్ హీరోలు, రాజకీయ నాయకుల వద్దకు పంపిస్తారని ఆరొపణలు చేశారు. అంతేకాదు వారితో బ్లూ ఫిలింస్ తీయించి రాజకీయ నాయకులను బెదిరిస్తుంటాడని, ఓ ప్రముఖ హీరో తమ్ముడికి రఘునందనే మహిళలను సరఫరా చేసేవాడని, ఆయనకు డ్రగ్స్ బిజినెస్ కూడా ఉందని అన్నారు. నా భర్తతో కలిసి రఘునందన్ నన్ను కిడ్నాప్ చేశాడని, ఇద్దరూ కలిసి నాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రఘునంద్ వల్ల నాకు, నా కుమారుడికి ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ ఆరోపణలపై స్పందించిన రఘునందనరావు ఆ మహిళ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఇదివరకే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై తాజాగా రఘునందన్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇంఛార్జ్ కృష్ణదాస్‌లకు లేఖ రాశారు. ఈ కేసులో కోర్ట్ తీర్పు వెలువడే వరకు తాను పార్టీ కార్యక్రమాలలో పాల్గొనబోనని లేఖలో పేర్కొన్నారు.