సీఎం కేసీఆర్ పై మండిపడుతున్న బీజేపీ నేత – కారణం ఏంటంటే…?

Saturday, December 14th, 2019, 01:22:06 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ మహిళా నేత కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని, కేవలం ఈ మద్యం అమ్మకాల వలనే రాష్ట్రంలోని అమ్మాయిలకు భద్రతా లేకుండా పోతుందని తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. కాగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టినటువంటి రెండు రోజుల మహిళా సంకల్ప దీక్ష విజయవంతంగా ముగిసింది. కాగా ఈమేరకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన అరుణ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.

కాగా తాము చేపట్టిన ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగిపోదని, దశల వారీగా కొనసాగిస్తామని చెప్పిన డీకే అరుణ మద్యపాన నిషేధం అంశం పై రాష్ట్రంలోని ప్రజలందరికి కూడా అవగాహనా కల్పిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించిన డీకే అరుణ, సీఎం కేసీఆర్ కి ఆడపిల్లల పాపం తగులుతుందని, ఈ విషయంలో తనకంటే చిన్నవాడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని చూసి నేర్చుకోవాలని వాఖ్యానించారు.