రావాలి జగన్ కాదు.. “పోవాలి జగన్”

Friday, September 20th, 2019, 04:25:42 PM IST

జగన్ టీటీడీ పాలక వర్గం లో తీసుకున్న నిర్ణయం పైన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పలు అరోపణలు చేసారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల గురించి తెలుసుకుంటే మంచిదని అభిప్రాయం పడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాస్ చేసిన మూడు జీవో లను వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. జగన్ ప్రభుత్వం పై కూడా పలు విమర్శలు గుప్పించారు భాను ప్రకాష్ రెడ్డి.

టీటీడీ పాలక వర్గ సభ్యుల పట్ల తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. రాజకీయ లబ్ది కోసం, అసంతృప్తి చెంది పదవులు దక్కని నేతల ఊరడింపు చర్యల కోసం జగన్ ఇలా చేసారని మంది పడ్డారు. టీటీడీ లో 36 మంది సభ్యులు ఎందుకంటూ ప్రశ్నించారు. 100 రోజుల పాలన పై సర్వత్రా విమర్శలు వెలువడిన విషయం అందరికి తెలిసిందే. కాగా ప్రజలు రావలి జగన్ కాదు, పోవాలి జగన్ అని అంటున్నారని అన్నారు.