సీఎం కెసిఆర్ పై సెటైర్లు వేసిన బీజేపీ నేత

Wednesday, August 14th, 2019, 02:35:26 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మీద, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ మరొకసారి విరుచుకపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వేలి అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్ కి ఒక పెద్దన్న లా ఉండి, అన్నింటిలో సహాయ సహకారాలు అందిస్తానని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తాని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి పని చేస్తామని కెసిఆర్ మాట్లాడారు… కాగా కెసిఆర్ చేసిన ఈ వాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ భూములు ఎండిపోతుంటే పట్టించుకోని కెసిఆర్, రాయలసీమను రతనాల సీమ ను చేస్తారంట అని బీజేపీ నాయకుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

కాగా సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు దర్శించున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈమేరకు ఇరు ముఖ్యమంత్రులు కలిసి తీసుకునే నిర్ణయాలపై సమగ్రంగా చర్చలు జరిపి సరైన నిర్ణయాలు తీసుకుంటామని కెసిఆర్ అధికారికంగా వెల్లడించారు. ముఖ్యమంత్రులు తెలుగు వారి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతున్నామని, కానీ ఉఇంతటి బృహత్కార్యాన్ని కపోందారు విమర్శకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.