కేటీఆర్ వాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత

Monday, August 12th, 2019, 09:30:25 PM IST

కేంద్రంలో రెండవసారి అధికారాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా తన సత్తా నిరూపించుకునేందుకు సిద్దమయింది. ఈమేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాగా తెలంగాణాలో అసమ్మతితో ఉన్నటువంటి ఇతర పార్టీల నేతలందరినీ కూడా తన పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కాగా తాజాగా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, తన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలోని తెరాస పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ లపై తీవ్రమైన విమర్శలను చేశారు. తెలంగాణాలో అధికారంలో ఉన్నటువంటి తెరాస పార్టీ కి కాంగ్రెస్ పార్టీ తోకల మారిందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.

అయితే ఇటీవల తెరాస పార్టీ కార్య నిర్వహణాద్యక్ష్యుడు కేటీఆర్, బీజేపీ మాజీ మంత్రి పై చేసిన వాఖ్యలన్నింటికి లక్ష్మణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా కేటీఆర్ ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కాగా బీజేపీ పై ఇష్టమొచ్చిన వాఖ్యలు చేసిన తెరాస నేతలందరూ కూడా ఓవైసీ సోదరులతో ”భారత్ మాతాకీ జై” నినాదం అనిపించగలరా? అని ఈసందర్భంగా లక్ష్మణ్ ప్రశ్నించారు. అంతేకాకుండా మజ్లీస్ ని కట్టడి చేసే దమ్ము తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఉందా అని లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఇతరులపై ఏదైనా వాఖ్యలు చేసే ముందు ముందుగా మన తప్పులన్నింటిని గుర్తు చేసుకోవాలని కేటీఆర్ ని ఉద్దేశించి బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన ఈ వాఖ్యలు అన్ని కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.