పవన్ కళ్యాణ్ వస్తే వద్దంటామా…? బీజేపీ నేత సంచలన వాఖ్యలు

Thursday, December 5th, 2019, 07:06:12 PM IST

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ జీవిఎల్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే ఈమేరకు మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవిఎల్, ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీ విలీన ప్రతిపాదనతో వస్తే తప్పకుండ ఆహ్వానిస్తామని వాఖ్యానించారు. కాగా ఎన్నికలకు ముందే పార్టీ విలీనము చేయాలని అడగగా అప్పుడు పవన్ తిరస్కరించారని, కానీ ఇప్పటికైనా ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పేశారు., అంతేకాకుండా బీజేపీ తో పని చేయాలనుకునే ప్రతీ స్థానిక పార్టీలందరిని కూడా సాదరంగ స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ వాఖ్యానించారు.

ఇకపోతే ఇటీవల పవన్ హిందువులపై చేసిన చేసిన వాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం హిందువులవల్లే గొడవలు జరుగుతున్నాయని చెప్పడం దారుణమని వెల్లడించారు. కాగా ఈ వాఖ్యలని పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోని, అందరికి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ కోరారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ… తానెప్పుడూ భారతీయ జనతా పార్టీతో విభేదించలేదని, బీజేపీ పార్టీ తో కలిసే ఉన్నానని అన్నారు. అయితే ఇంత అకస్మాత్తుగా పవన్ ఇలా బీజేపీ కి మద్దతుగా మాట్లాడటం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.