టీడీపీ కి అర్థం మార్చిన బీజేపీ నేత

Sunday, September 22nd, 2019, 07:54:45 PM IST

భారతీయ జనతా పార్టీ నేత, నెహ్రు యువజన కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పైన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్ప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పరువు పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీ, రానున్న రోజుల్లో మొత్తం ఖాళీ అవుతుందని, టీడీపీ లో ఇక ఇద్దరు ముగ్గురు తప్ప వేరే వారెవరు కూడా కనబడరని ఆయన విమర్శించారు. ఇప్పటికికూడా ప్రజల్లో టీడీపీ పార్టీ పైన అసలే నమ్మకం లేదని, కానీ ప్రజల్లో నమ్మకం పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేతలైన చంద్రబాబు మరియు లోకేష్ ల తీరు చాలా దారుణంగా ఉందని, అదంతా కూడా ఒక కామెడీ షో లాగ కనిపిస్తూందని ఆయన తెలిపారు.

ఇకపోతే టీడీపీ లో అందరు కూడా అవినీతిపరులే అని, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభివర్ణించారు. ఇకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో అధికారాన్ని ద్దాం పెట్టుకొని నేతలందరూ కూడా చాలా అవినీతికి పాల్పడరని, కాగా వాటన్నింటిని కూడా తాము బయటపెట్టమని విష్ణువర్ధన్ తెలిపారు. ఇకపోతే టీడీపీ పార్టీ తరపున అవినీతికి పాల్పడ్డ నేతలు చాలా తొందర్లోనే తీహార్ జైలుకు వెళ్ళబోతున్నారని, వారి మిత్రపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నారని, అందుకనే ముందు జాగ్రత్తగా టీడీపీ నేతలు హిందీ నేర్చుకోవాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సలహా ఇచ్చారు.