ఏపీకి ప్రత్యేక హొదా ఇవ్వలేమని చెప్పేసిన కేంద్రం..!

Wednesday, July 10th, 2019, 12:15:29 AM IST

రాష్ట్ర విభాన్ తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రం నుంచి రావలసిన సహాయాన్ని మాత్రం ఏపీకి అందిస్తామని లిఖిత పూర్వక సమాధానాన్ని అందించారు.

అయితే గతంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండి బీజేపీతో మంచి సన్నిహిత్యంగా ఉన్నా ఏపీకి ప్రత్యేక హోద్ద తీసుకురాలేకపోయారు. అయితే చంద్రబాబు కూడా చివరలో బీజేపీతో విబేధించి ప్రత్యేక హొదా కావాలని పట్టు పట్టినా దానిని మాత్రం సాధించలేకపోయారు. అయితే జగన్ ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి అయినా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పారు. అయితే గత కొద్ది రోజుల నుంచి బీజేపీ నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా తీరని కలే అని మాట్లాడుతుండడం, నేడు దానిపై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇవ్వలేమ్ని చెప్పడం చూస్తుంటే ఇక ఏపీకి ప్రత్యేక హొదా కష్టమే అన్నట్టు కనిపిస్తుంది. అయితే ఏపీకి ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రస్తుతం తాము ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలపై దృష్టి సారించామని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ కూడా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటారనేదే ఇప్పుడు అయోమయంగా మారింది.