తెలంగాణ సీఎం కేసీఆర్‌కి లేఖ రాసిన లక్ష్మణ్.. ఏమన్నాడంటే..!

Wednesday, June 24th, 2020, 12:23:24 AM IST


తెలంగాణ సీఎం కేసీఅర్‌కి బీజేపీ నేత లక్ష్మణ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని కరోనా కేసుల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని అన్నారు.

అయితే రాష్ట్రంలో ఏప్రిల్‌లో 3.8శాతం ఉన్న కేసులు ఇప్పుడు 28శాతం పెరిగాయని, హైదరాబాద్‌ను కరోనా నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని అన్నారు. నియంత పాలనకు టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే నిదర్శనం అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.