బ్రేకింగ్: జగన్ పాలనా తీరుపై సుజనా సెన్సేషనల్ కామెంట్స్..!

Wednesday, October 16th, 2019, 05:36:34 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం మునుపెన్నడూ లేని విధంగా ఓటమిపాలైంది. అయితే టీడీపీ ఓటమి తరువాత అనేక మంది నేతలు పార్టీనీ వీడి వైసీపీ, బీజేపీలో చేరిపోయారు. అయితే టీడీపీ ఓటమి తరువాత బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తాజాగా వైసీపీ పాలనపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఏపీలోని సమస్యలపై గ్రీవేన్స్ సెల్ ఏర్పాటు చేస్తే వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే, సమస్యల దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని కామెంట్స్ చేశారు. అయితే ప్రస్తుతం జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని ప్రజా సమస్యలను వదిలేసి ఇతర పార్టీ నేతలను టార్గెట్‌గా పెట్టుకుని కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేకాదు జగన్ ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిది ఒకటి ఇప్పుడు చేస్తుంది మరొకటి అని ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని అన్నారు. పోలవరం రివర్స్ టెంటరింగ్ విషయంలో కేంద్రం, హైకోర్టు ఇచ్చిన తీర్పును కాదని జగన్ ఇష్టారీతీగా వ్యవహరిస్తున్నారని, సమస్యలను పరిష్కరించే ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తుందని మండిపడ్దారు.