ఈటల బీజేపీ ఎంట్రీపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saturday, June 5th, 2021, 12:45:29 AM IST

bjp mla rajasingh

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో ఆయన బీజేపీ గూటికి చేరబోతున్నారు. అయితే ఈటల రాకను బీజేపీలో కొందరు నేతలు స్వాగతిస్తుంటే, మరికొందరు నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే తాజాగా ఈటల బీజేపీ చేరికపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాకను వ్యతిరేకిస్తే అలా వ్యతిరేకించిన వారికే నష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ ఎవరి సొంతం కాదని, పార్టీలో ఎవరిని చేర్చుకోవాలో పూర్తిగా అధిష్టానం నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఈటలతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీలో చేరుతున్నారని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.