సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే…?

Thursday, December 12th, 2019, 08:21:12 PM IST

తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దిశ హత్యోదంతం విషయంలో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలిపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో సీఎం కేసీఆర్ ని తప్పుబడుతున్నారు కొందరు బీజేపీ నేతలు… కాగా రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. దానికి కారణం కేవలం మద్యమే అని విమర్శలు చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలన్న ఒకే ఒక్క డిమాండ్ తో బీజేపీ నాయకురాలు డీకే అరుణ నేతృత్వంలో నేడు ఇందిరా పార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష ని చెప్పట్టారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ… మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి, చివరికి మద్యం రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రాష్ట్రంలో జరిగినటువంటి దిశ హత్య కి కారణం కేవలం మద్యం వల్లే జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఇలా మద్యం వలన ఇంకెన్ని కుటుంబాలను నాశనం చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరుకుతుందని, దీనికి అంతటికి కారణం తెరాస ప్రభుత్వమే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.