వైసీపీ, టీడీపీపై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ..!

Friday, June 26th, 2020, 08:16:14 PM IST

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, విపక్ష పార్టీ టీడీపీలపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఎన్టీఆర్‌, చంద్రన్న, వైఎస్సార్‌, జగనన్న మాత్రమే మహానాయకులా అని ధ్వజమెత్తారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన ప్రకాశం, వీరేశలింగం కనిపించరా అని నిలదీశారు.

అయితే రెండు ప్రాంతీయ పార్టీల వలన రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, ఏపీకి రాజకీయంగా 4 గ్రహణాలు పట్టాయని అన్నారు. రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తప్పుబట్టారు.