బీజేపీ ఎంపీ సంచలనం : నిజంగా కెసిఆర్ అలాంటివాడా…?

Saturday, June 15th, 2019, 01:43:34 AM IST

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ముఖ్యమంత్రి మీద కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా తీవ్రమైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అత్యంత తెలివైన అవినీతిపరుడని, అంతేకాకుండా దేశంలోనే కేసీఆర్‌ అత్యంత అవినీతిపరుడని విమర్శించారు. లాభాల్లో ఉన్న షుగర్‌ ప్యాక్టరీ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు గతంలో బాగానే సంపాదించుకున్నారు. కానీ తెరాస పార్టీ నేతలు మాత్రం అంతలా నష్టాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని కూడా వదలకుండా దోచుకున్నారని ఆరోపించారు. కేవలం నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఇలాంటి గతి పట్టడానికి కారణం తెరాస పార్టీ అని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. అంతటి పేరున్న ఫ్యాక్టరీకి ఇలాంటి గతి పట్టడం నిజంగా దురదుష్టకరం అని అరవింద్ అన్నారు. టీడీపీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కూడా షుగర్‌ ఫ్యాక్టరీ అభివద్ధి చేయలేదన్నారు. కాగా కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాకే చెరుకు రైతుకు మద్దతు ధర ఇస్తున్నారని, మళ్ళీ మోడీ వల్లే ఫ్యాక్టరీ కి పూర్వ వైభవం వస్తుందని అన్నారు..