బిగ్ బ్రేకింగ్ : మరోసారి జగన్ పై సుజనా చౌదరి సంచలనం.!

Wednesday, January 15th, 2020, 09:53:24 AM IST

తాజాగా వైసీపీ అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంతో ఒక్క వైసీపీ నేతలు తప్ప మరెవరూ కూడా ఏకీభవించడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.అయినప్పటికీ జగన్ అండ్ కో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని తరలింపు విషయంలో ఎక్కడా కూడా తగ్గేట్టుగా లేరు.దీనితో రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించడం ఖాయమని చెప్పకనే చెప్పేసారు.అయితే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలనం రేపారు.

రాజధాని అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించొద్దు అంటూ ఏకంగా ఒక 10 పేజీల లేఖను రాసి ఆయనకు పంపినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.జగన్ సీఎం అయ్యాక అమరావతిలో దాదాపు 40 వేల కోట్లకు పైగా పనులను నిలిపేశారని, 12 శాతం భూముల్లో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని మిగతా 88 శాతం భూములను నిరుపయోగంగా మారుస్తారా అని అందులో పేర్కొన్నారు.ఏది ఏమైనప్పటికీ మాత్రం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఓ సారి మళ్ళీ పునః సమీక్షించుకోవాలని ఆ లేఖ ద్వారా జగన్ కు సూచించారు.