బిగ్ బ్రేకింగ్ : “ఆపరేషన్ గరుడ” తర్వాత ఏపీలో మరో సంచలన ఆపరేషన్..?

Thursday, July 11th, 2019, 10:49:45 AM IST

గత కొన్నాళ్ల క్రితం సినీ నటుడు కం రాజకీయాల్లో ఏదో చేద్దామని వచ్చిన వ్యక్తి శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ పురాణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంత తేలికగా మర్చిపోయే అంశం కాదు.ఆ ఆసమయంలో బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరించేందుకు వ్యూహాలు రచిస్తుందని అందుకోసమే ఈ ఆపరేషన్ గరుడ అనేదాన్ని మొదలు పెట్టారని శివాజీ ఒక బాంబు పేల్చగా రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగింది.ముందు శివాజీ చెప్పిన మాటలు అంతగా ఎవరు పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత కొద్దీ కొద్దిగా పరిణామాలు అతను చెప్పినట్టే జరుగుతుండడంతో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.

ఇది ఇప్పుడు ముగిసిన అధ్యాయం అనుకుంటే ఇప్పుడు బీజేపీ మళ్ళీ మరో సంచలన ఆపరేషన్ మొదలు పెట్టనున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఒక వార్త సంచలనంగా మారింది.దీనికి వారు “ఆపరేషన్ ఆగస్ట్” అనే పేరు కూడా పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బలపడేందుకు పావులు కదపబోతుంది అని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.ముఖ్యంగా వీరు ఆంధ్ర రాష్ట్రంపైనే ఎక్కువ దృష్టి పెట్టనున్నారని అందులో భాగంగానే ముందు తెలుగుదేశం పార్టీను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ తర్వాత ఎన్నికల కల్లా అధికారమే ప్రధాన లక్ష్యంగా వెళ్లాలని అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.మరి వీరి కలలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.