విశ్లేషణ : జగన్ పై మరో కుట్ర..బీజేపీ ఏం చెయ్యబోతుందో తెలుసా?

Friday, November 22nd, 2019, 03:44:47 PM IST

ఏపీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని భారీ విజయాల్లో వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతం చేసుకున్న విజయం కూడా ఒకటి.దాదాపు తొమ్మిదేళ్ల కల 2019లో నెరవేరింది.జగన్ అఖండ విజయానికి వై ఎస్ అభిమానులు ఉప్పొంగిపోయారు.మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందని తలచారు.అలాగే జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చడానికి సర్వత్రా తన సాయ శక్తులా ప్రయత్నం చేస్తున్నారు.

అయితే మొదట్లో జగన్ ఏ స్థాయిలో అగ్రెసివ్ గా ఉండేవారో ఇప్పుడు అలా ఉండడం లేదని మరో వాదనలు కూడా గట్టిగా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అయితే జగన్ ఎన్నో ఏళ్ల కల రాబోయే మరో ముప్పై ఏళ్ళు కొనసాగించాలి అనుకున్న ప్రస్థానానికి ఇప్పుడు బ్రేక్ పడేలా ఉందా?దానికి ఎలాంటి ప్లానింగ్స్ జరుగుతున్నాయి.అతన్ని మళ్ళీ జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతుందా అయినా సరే జగన్ ఎందుకు సరైన స్పందన ఇవ్వట్లేదు అన్న అనుమానాలు అనేకం ఉన్నాయి.

కానీ వీటన్నిటికీ ఒకటే సమాధానం జగన్ ఏమీ అనకపోవడానికి కారణం ముమ్మాటికీ బీజేపీ పార్టీయే అని ఇప్పుడు ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.జగన్ పై ఉన్న అవినీతి కేసులు మూలంగా గట్టిగా వారు కేంద్రంతో పోరాడలేకపోతున్నారు.తమకు కావల్సిన దాని కోసం హక్కుల కోసం డిమాండ్ చేయలేకపోతున్నారు.దీనికి సాక్ష్యంగా ఏపీలోనే తీసుకుందాం టీడీపీ అంటే ఓ మోస్తరుగా వైసీపీ నేతలు బయటకొచ్చి దుమ్ము దులిపేస్తారు.

అలాగే జనసేన పార్టీ ఏమన్నా అంటే వారు ఏ శాఖకు సంబంధించి విమర్శలు చేసారో ఆ మంత్రి తప్ప ఓ పది మంది ప్రెస్ మీట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు.కానీ….బీజేపీ నేతలు మాత్రం వీరి కంటే దారుణమైన వ్యాఖ్యలు చేసినా ఒక్క మాట కూడా అనలేరు.అనడం లేదు కూడా.గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో కామెంట్స్ లో రెచ్చిపోవడం తప్ప జగన్ మరియు ఇతర నేతలు ఎందుకు బీజేపీని ఏమీ అనడం లేదు ఒకవేళ ఏమన్నా అంటే నిజంగానే జగన్ ను మళ్ళీ జైల్లో పెట్టేస్తారా అన్న అనుమానాలు వారికి కూడా లేకపోలేవు.

ఇప్పుడు ఇవే వైసీపీ మరియు జగన్ లో ప్రధాన బలహీనతలుగా కనిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ బలహీనతను ఎప్పటి నుంచో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట తమ పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీకు ఆసరాగా మారింది.అందుకే కేంద్రంలో ఉండి ఇక్కడ జగన్ ను కంట్రోల్ పెట్టారని పలువురు అంటారు.అందులో భాగంగానే ఏపీలోని కీలక నేతలను టీడీపీ నుంచి లాగేసుకున్నారు.ఇప్పుడు వారితోనే రాష్ట్రంలో ఏదో చెయ్యించేలా ఉన్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక చర్చ మొదలయ్యింది.

అలాగే గత కొన్ని రోజుల క్రితమే జగన్ బైలు రద్దు అంటూ కొన్ని స్పెక్యులేషన్స్ కూడా మొదలయ్యాయి.ఇలా ఎటు నుంచి చూసినా ఇప్పుడు ఏపీలో మెయిన్ టార్గెట్ గా జగనే కనిపిస్తున్నాడు.అందుకోసమే బీజేపీ ఓ ఆపరేషన్ మొదలు పెట్టనుంది అని తెలుస్తుంది.కేంద్రం నుంచి ఇక్కడ సుజనాతో అసలు ఆట ఇప్పుడు మొదలు పెట్టనుంది అని ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక టాపిక్ వైరల్ గా మారింది.

వైసీపీకు చెందిన పలువురు ఎంపీలు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారని సుజనా పేల్చిన బాంబు పెద్ద రచ్చగా మారిపోయింది.వారిని సరైన సమయంలో తమ పార్టీలో చేర్చుకోబోతున్నామని వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా ఉన్నామని అన్న మాటలు మరింత కలకలం రేపాయి.దీనితో ఇక జగన్ పనైపోయినట్టేనా అన్న అనుమానం ఇప్పుడు పక్కన పెడితే నిజంగానే బీజేపీకు అంత సీన్ ఉందా అన్న ప్రశ్న వస్తుంది.కేంద్రంలో వీరు ఉన్నంత మాత్రాన ఓ బలమైన ప్రాంతీయ పార్టీను ఎలా కూల్చేస్తారు?దానిని ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారన్న కోణాలు కూడా ఉన్నాయి.

అయితే ఇది మాత్రం పక్కాగా వైసీపీ శ్రేణులను కాస్త గందరగోళంలో పడెయ్యడానికే బీజేపీ ఆడుతున్న మైండ్ గేమా లేక నిజంగానే జగన్ పై కుట్ర పూరితంగానే బీజేపీ ఏదన్నా ఊహించని పని చేస్తుందా అన్న అనుమానాలు అనేకం లేవనెత్తుతున్నాయి.ఈ రెండిట్లో ఇప్పుడు దేనికైనా సరే 50-50 శాతం అవకాశాలే ఉన్నాయి.అయితే బీజేపీ ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసి గద్దెనెక్కేద్దామన్నా కుదరదు.

వైసీపీకు వ్యక్తిరేఖంగా ఉన్నవారంతా బీజేపీకు చుట్టం కూడా కాదు వారు ఏపీకి చేసిన ద్రోహం కూడ ఎవరూ మర్చిపోలేదు.దానిని బట్టి బీజేపీ కూడా ఏపీలో ఏదన్నా చెయ్యాలన్నా కాస్త ఆలోచించుకోవాలి.అందువల్ల వీరు జగన్ పై నిజంగానే కుట్ర పన్నినా వీళ్ళకి ఒరిగేది ఏమీ ఉండకపోగా వారికే నష్టాలు తప్పవు అని చెప్పాలి.వీరు ఇస్తానన్న ప్రత్యేకహోదా అలాగే అమలు పరచాల్సిన విభజన హామీల చట్టాలు నెరవేర్చేంత వరకు బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచే ఛాన్స్ ఉండదు.అందువల్ల వీరు ఏపీలో బలపడేందుకు మరో మార్గాన్ని ఎన్నుకుంటే బెటర్..