సౌత్ మీద పట్టుకోసం బీజేపీ ఆరాటం

Sunday, January 29th, 2017, 12:48:33 PM IST

bjp
ఉత్తరాది వారి ఆధిపత్యం దక్షిణాది రాష్ట్రాల మీద తీవ్రంగా పెరుగుతూ వస్తోంది అనేది ప్రస్తుతం నడుస్తున్న వివాదం. ఈ మాట స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పి ఇది మంచి పరిణామం కాదు అని అంటున్నాడు. అయితే ఎంతో కాలం గా ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ మాత్రం సౌత్ లో అంతంత మాత్రంగానే ఉంది. కర్ణాటకను లక్ష్యంగా చేసుకున్న ఈ వ్యూహంలో.. ఆ రాష్ట్రంలో అధికారపక్షంగా అవతరించటంతో పాటు.. సౌత్ లో తమ ముద్ర వేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగాతాజాగా ఒక అడుగుపడిందని చెప్పాలి. కర్ణాటక కాంగ్రెస్ లో కీలకనేత.. పట్టున్న నాయకుడు.. మాజీ కేంద్రమంత్రి ఎస్ ఎం కృష్ణను తమ పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో బీజేపీ విజయవంతం అయ్యిందని చెప్పాలి. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ తో కలిసి ఉన్న ఆయన.. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. ఆయన రాజీనామా లేఖ కాంగ్రెస్ కు కరెంటు షాక్ మాదిరి మారింది.