టీడీపీకి గుడ్ న్యూస్ చెప్పిన బీజేపీ.. సంతోషంలో తెలుగు తమ్ముళ్ళు..!

Wednesday, July 17th, 2019, 03:08:34 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.

అయితే టీడీపీ నుంచి ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీనీ వీడి బీజేపీలో చేరిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారందరూ బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు వినబడ్డాయి. ఒక వేళ అదే కనుక జరిగితే టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి పరిస్థితికి చేరుకునేది. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరటం లేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చెప్పడంతో టీడీపీ కాస్త ఊపిరి పీల్చుకుంది. కానె మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికలలో ఓటమి పాలైన వారు మాత్రం ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి సిద్దమయ్యారని వారందరిని బీజేపీలో చేర్చుకుంటామని 2024 ఎన్నికల లోపు రాష్ట్రంలో బీజేపీ బలపడడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు. అయితే టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలోనే కొనసాగాలని 2024 ఎన్నికలలో అధికారం తిరిగి దక్కించుకుంటామని చంద్రబాబు నేతలకు, కార్యకర్తలకు ధైర్యాన్ని అందిస్తున్నారు.