పవన్ విషయంలో గట్టిగానే శ్రద్ధ పెట్టినట్టున్నారుగా..!

Friday, July 31st, 2020, 07:03:18 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో మరోసారి టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ అయ్యారు. మూడో ప్రత్నామ్యయం గా పవన్ సాధించిన అంశాల్లో ఇప్పుడు అతి కీలకంగా విద్యా విధానంలో మార్పులు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎప్పుడో 2019లో తాను ఇలాంటి విద్యా విధానాన్ని కోరుకుంటున్నా అని పవన్ తెలపగా వాటిని కీలక అంశంగా పేర్కొని రాబోయే రోజుల్లో విద్యా విధానాన్ని మార్చబోతున్నామని కేంద్రం తెలిపింది. దీనితో ఈ విషయంలో మాత్రం పవన్ పై భారీ ఎత్తున ప్రశంసల జల్లు కురిసింది.

ముఖ్యంగా అయితే బీజేపీ నేతలు అందులోనూ ఉత్తరాది నేతలు పవన్ పేరును ప్రస్తావించి అభినందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఇక్కడ బీజేపీతో జతకట్టిన పవన్ కు ఇక్కడి బీజేపీ నేతలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడేమో ఉత్తరాది కీలక నేతలే పవన్ ను హర్షించడం మొదలు పెట్టారు. మొత్తానికి మాత్రం పవన్ విషయంలో బీజేపీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందా అని చెప్పాలి.