విజయ్ అంటే బిజెపి వాళ్లకు పడడం లేదా.. నానా రభస చేస్తున్నారు ?

Tuesday, October 24th, 2017, 03:04:31 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా నటించిన మెర్సల్ సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం మూడు రోజులకే వందకోట్ల భారీ వసూళ్లను దక్కించుకుని దూసుపోతుంది. మరో వైపు ఈ సినిమాలో జిఎస్టీ, ప్రభుత్వ ఆసుపత్రుల విధానం పై ప్రభుత్వాన్ని ఎండగట్టేలా డైలాగ్స్ ఉన్నాయి .. ఆ డైలాగ్స్ ఇప్పుడు అధికార బిజెపి పార్టీ ని టెన్షన్ పెడుతున్నాయి. ఆ డైలాగ్స్ వల్ల ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువయింది. దాంతో బిజెపి పార్టీ నాయకులూ విజయ్ ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బిజెపి తమిళనాడు అధ్యక్షుడు హెచ్ రాజా, విజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. విజయ్ ఓటర్ ఐడి ని చూపిస్తూ విజయ్ క్రిష్టియన్ మతంలోకి మారాడని అన్నారు. విజయ్ పేరు సి జోసెఫ్ విజయ్ అని పేరుందని, హిందువుగా ఉన్న అయన క్రిష్టియన్ మతంలోకి మారాడని విమర్శలు చేసారు. దానికి స్పందించిన విజయ తండ్రి తన పేరు చంద్ర శేఖర్ అని నేను హిందువునే అని, మా అబ్బాయి విజయ్ .. ఏ మతం వాడు కాదని , తాను ఓ భారతీయుడు అని అన్నారు ? అయినా జొషెఫ్ విజయ్ అని పేరు పెట్టుకుంటే అందులో తప్పేముందని నిలదీశారు. సినిమాలోని డైలాగ్స్ వల్లే బిజెపి నాయకులకు నిద్ర పట్టడం లేకే .. ఇలాంటివన్నీ తెరపైకి తెస్తున్నారంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ రాద్దాతం ఎంతవరకు పోతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments