రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి లైన్ క్లియర్ చేసేస్తున్నారుగా.!

Sunday, June 2nd, 2019, 04:15:28 PM IST

రాజకీయాలు అంటే కేవలం ఒక్క పార్టీ గుప్పిట్లోనే అధికారం ఉండాలి అన్నట్టుగా ప్రస్తుత రాజకీయ పార్టీలు తయారు అయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అలాగే యావత్తు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నిటిని కాషాయమయం చేసెయ్యాలని కేంద్రంలో ఉన్న రూలింగ్ పార్టీ అయినటువంటి బీజేపీ భావిస్తుందని ఇది వరకే చాలా సార్లు మనం వినేసాము.అయితే బీజేపీ పట్టు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంతగా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉండదని కూడా అందరికీ తెలుసు.ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా ప్రజలు ప్రాంతీయ భావాన్ని కనబరుస్తారు.

అందువల్ల వారి పప్పులు మన దగ్గర అంతగా ఉడకలేదు.అయితే ఇప్పుడు మన రెండు తెలుగురాష్ట్రాల్లో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ మరింత బలంగా మారనుందా అంటే విశ్లేషకులు అందుకు ఛాన్స్ లేకపోలేదు అని అంటున్నారు.ఎందుకంటే అస్సలు బీజేపీ పార్టీ ఉనికి లేదు అని తెలంగాణాలో ఎంత మొత్తుకున్నా అక్కడ ఎంపీ ఎన్నికల్లో 4 స్థానాల్లో కాషాయ జెండాను ఎగురవేసి ఆశ్చర్య పరిచారు.అలాగే ఆంధ్రాకు వచినట్టైతే జగన్ వారికి అనుకూలంగా ఉన్నారని వారు ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు.

అలాగే జగన్ ను ఎన్డీఏ లో కలుస్తారా అని అడిగినందుకు కూడా జగన్ తటస్థ స్పందనను కనబర్చారు తప్ప వ్యతిరేఖంగా అయితే తన స్పందనను కనబరచలేదు.ఈ ఒక్క కారణం చేత మాత్రమే కాకుండా ఇప్పుడు వైసీపీ మరియు టీడీపీకి చెందిన నేతల్లో అసమ్మతి ఉన్నవారు కూడా ఉండే ఉంటారు.సో వారి ముందు బీజేపీ మరియు జనసేన పార్టీలు థర్డ్ ఛాయిస్ గా కనిపించగా వారు కానీ బీజేపీ వైపు వెళ్లినట్టయితే అది వారికి అదనపు బలం అవుతుంది.అందువల్ల రానున్న రోజుల్లో బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలమైన పార్టీగా అవతరించినా పెద్దగా ఆశ్చర్యపడక్కరలేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.