బీజేపీ గెలుపుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు!

Thursday, June 13th, 2019, 03:51:55 PM IST

ఒక చ‌ర్చ‌కు ప్ర‌తి చ‌ర్య అన్న‌ది ప్ర‌కృతిలో వున్న సిద్ధాంతం. ఏదైనా స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైతే దానికి సొల్యూష‌న్ త‌ప్ప‌కుండా వుంటుంద‌న్న‌ది మ‌న‌కు తెలిసిందే. ఇదే సూత్రం ఈవీఎంల‌కు ఎందుకు వ‌ర్తించ‌దు అనే వాద‌న గ‌త కొంత కాలంగా వినిపిస్తోంది. ఎక్క‌డో మారుమూల దేశంలో వున్న వాడు ఇంట‌ర్నెట్ స‌హాయంతో కొన్ని వేల కిలోమీట‌ర్ల దూర‌లో వున్న‌వాడి సొమ్మును కొట్టేస్తున్నాడు. అది సాధ్య‌మైన‌ప్పుడు ఈవీఎంలని ట్యాంప‌రింగ్ చేయ‌డం ఎందుకు సాధ్ం కాదు అన్న వాద‌న దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. అయితే అది సాధ్యం కాద‌ని కొంత మంది నిపుణులు చెబుతున్నా అది న‌మ్మ‌శ‌క్యంగా క‌నిపించ‌డం లేదు. దాంతో ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా?. అంటే ప్ర‌తిప‌క్షాలు ముక్త‌కంఠంతో అది ముమ్మాటికీ నిజ‌మేనంటున్నాయి. ఎలా జ‌రిగింది?.. ఎక్క‌డ మొద‌లైంది? అన్న విష‌యాల‌పై మాత్రం ఎవ‌రిలోనూ క్లారిటీ లేదు. పైగా శాస్త్రీయంగా నిరూపించేంత అవ‌గాహ‌న ప్ర‌తిప‌క్ష నాయ‌కుల్లో లేక‌పోవ‌డం బీజేపీకి మ‌రింత క‌లిసి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర హోమ్ శాఖ స‌హాయ మంత్రిగా కిష‌న్‌రెడ్డి ఎంపిక కావ‌డం ప‌ట్ల పెద్ద మ‌త‌ల‌బే వుంద‌నేది తాజా వాద‌న‌. `సెంట్ర‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ ఆఫ్ హైద‌రాబాద్‌`లో కిష‌న్‌రెడ్డి టూల్ డిజైనింగ్ లో డిప్లొమాతో పాటు రోబోటిక్స్‌లో ఇంజ‌నీరింగ్ పూర్తి చేశారు. టెక్నిక‌ల్‌గా ఆయ‌న‌కు బాగా తెలుసు. ఈవీఎంల మానిప్లేటింగ్ విష‌యంలో కిష‌న్‌రెడ్డి కీల‌క పాత్ర పోషించార‌ని గ‌తంలో ఓ వ్య‌క్తి ఆరోప‌ణ‌లు కూడా చేశారు. అయితే అత‌ని మాట‌ల్ని ఎవ‌రూ న‌మ్మ‌లేదు.

దేశ వ్యాప్తంగా జీఎస్టీ, నోట్ల ర‌ద్దు, పెట్రోల్ వ‌డ్డ‌న‌.. వంటి త‌దిత‌ర అనాలోచిత నిర్ణ‌యాల‌తో సామాన్య బ‌డుగు జీవితని అత‌లా కుత‌లం చేసింది బీజేపీ ప్ర‌భుత్వం. అలాంటి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లంతా దేశ వ్యాప్తంగా అస‌హ‌నంతో వున్నారు. ఇది వాస్త‌విక‌త‌. కానీ సార్వ‌త్నిక ఎన్నిక‌ల్లో మాత్రం అందుకు విరుద్ధంగా బీజేపీకి యునాయిమ‌స్‌గా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టిన‌ట్టు బ‌యట‌ప‌డింది. అయితే ప్ర‌జ‌ల్లో అసంతృప్తి వంది కానీ ఈవీఎంలే వారికి ప‌నిచేయ‌లేదా?. ఏమీట నొక్కినా బీజేపీకే ఓట్లు ప‌డ్డాయా? ఇది ప్ర‌తి ప‌క్ష పార్టీలే కాదు యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న స‌గ‌టు ఓట‌ర్ని తొలుస్తున్న మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న ఇది. దీని వెన‌కాల ఏం జ‌రిగింది?. దేశ వ్యాప్తంగా మూక హ‌త్య‌లు, మూక స్వామ్యంతో సామాన్య జ‌నాన్ని అభ‌ద్ర‌తా భావానికి గురిచేసిన బీజేపీనే ఎందుకు కోరుకుంటారు?. కోరుకోరు క‌దా? అలాంట‌ప్పుడు ఎవ‌రి అండ లేకుండా బీజేపీకి అత్య‌ధిక స్థానాలు ఎలా వ‌స్తాయి?. వీటి వెన‌క జ‌రిగిన అస‌లు కుట్ర కోణం ఏమిటి అన్న‌ది తేలాల్సి వుంది.