జగన్ టార్గెట్ గానే బీజేపీ కొత్త గవర్నర్ ని దింపిందిగా…?

Thursday, July 18th, 2019, 01:32:02 AM IST

ఏపీకి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని నియమిస్తూ నిన్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఏపీకి కొత్త గవర్నర్ గా ఒక బీజేపీ సీనియర్ నేత రావడంతో ఏపీలోని బీజేపీ నేతలందరికీ కూడా కొత్తగా బలం వచ్చిందని అందరు అనుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా అసలు ఏపీలో బీజేపీ నేతలెవరూ కూడా సరిగ్గా ఫామ్లో లేరని చెప్పాలి. అయితే ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటు లేదు, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీనే తొందర్లో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా మారబోతుందని, రానున్న 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అధికారాన్ని సొంత చేసుకుంటుందని ఇప్పటినుండే బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఏపీ బీజేపీ నేతలకు ఇంతలా మాట్లాడానికి దైర్యం ఎలా వచ్చిందని అందరు అనుకుంటున్నారు.

అయితే ఈ నేపథ్యంలో 85 సంవత్సరాల బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి కొత్త గవర్నర్ గా ఏ రకమైన సంచలనాలు నమోదు చేస్తారోనన్న చర్చ సాగుతోంది. అయితే ఇప్పటివరకు కూడా ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించిన నరసింహన్ మాత్రం మాజీ బ్యూరోక్రాట్. అందుకనే ఆయన రాజకీయాల్లో పెద్దగా తలదూర్చలేదని చెప్పాలి. కానీ ఏపీకి కొత్తగా వచ్చిన బిశ్వభూషణ్ మాత్రం కొన్ని సంవత్సరాల నుండి కూడా రాజకీయాల్లో బాగా తలపండినవాడు. అంతేకాకుండా ఇతను పక్కా RSS మనిషి. అయితే ఇపుడు రాజ్ భవన్ అండ ఏపీ బీజేపీకి గట్టిగానే ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఇదే సరియన్ అవాశం అని అందుకనే జగన్ ని టార్గెట్ చేసి బిశ్వభూషణ్ హరిచందన్ ని ఏపీకి గవర్నర్ గా నియమించిందని రాజకీయవర్గాల్లో బలంగా ఈవార్త వినిపిస్తుంది.